జగిత్యాల పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో సోమవారం నుంచి జనవరి 14 వరకు 30 రోజులపాటు ధనుర్మాస ఉత్సవాలకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ నెల రోజులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో తిరుప్పావై, శ్రీ లక్ష్మీ విష్ణుసహస్రనామ పారాయణం, నాయినాయిగ 16 వ పాశురం, క్షీరాభిషేకం, ముక్కోటి ఏకాదశి, కూడారై, తదితర కార్యక్రమాలు నిర్వించనున్నట్లు పేర్కొన్నారు.