తండ్రిని చంపిన కొడుకుకి జీవిత ఖైదు
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాపల్లికి చెందిన తండ్రి గడుగు పోచయ్యను కొట్టి చంపిన కొడుకు ప్రభుదాస్ కి జీవిత ఖైదు, రూ 5000 జరిమానా విధిస్తూ జగిత్యాల జిల్లా న్యాయమూర్తి నీలిమ మంగళవారం తీర్పు వెల్లడించారు. భూమి విక్రయం ఈ హత్యకు దారి తీసింది. పై కేస్ లో నిందితునికి శిక్ష పడటం పడటంలో కృషి చేసిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.