రుణమాఫీ రాని రైతుల పరిస్థితి ఏమిటి: ఎమ్మెల్యే
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో 9, 500 మంది రైతులకు గాను సుమారు కేవలం 3000 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని మిగతా రైతుల సంగతి ఏంటని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అధికారులను ప్రశ్నించారు. మంగళవారం మల్లాపూర్ మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జగదీష్, ఎమ్మార్వో వీర్ సింగ్, పంచాయతీరాజ్ డిఈ, అన్ని గ్రామాల ప్రత్యేక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.