గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఈనెల 10న విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నది. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజలు తలచుకుంటే డబ్బు లేని రాజకీయాలు ఎలా సాధ్యమవుతాయో.. జిల్లా కలెక్టర్ ఏం చేయగలరో.. అలాగే ఒక ఎలక్షన్ ఆఫీసర్ ఏం చేయగలరో సినిమాలో చక్కగా చూపించారు. నిజజీవితంలో పవన్ కల్యాణ్ కూడా అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తున్నారు’ అని కొనియాడారు.