ఇజ్రాయెల్‌లో ఉద్యోగాలు.. రేపటి నుంచి నియామక డ్రైవ్

51చూసినవారు
ఇజ్రాయెల్‌లో ఉద్యోగాలు.. రేపటి నుంచి నియామక డ్రైవ్
ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో కార్మికుల ఉద్యోగాలకు హైదరాబాద్ న్యాక్‌లో రేపటి నుంచి ఈనెల 24 వరకు స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు. 21-45 ఏళ్ల వయసు, సంబంధిత రంగంలో మూడేళ్ల అనుభవం ఉన్నవారు అర్హులు. నెలవారీ వేతనం ప్యాకేజీలు రూ.1.20లక్షల నుంచి రూ.1.38 లక్షల వరకు ఉంటాయి. పూర్తి వివరాలకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ వెబ్‌సైట్ లేదా 9985483931/7893566493 నంబర్లలో సంప్రదించండి.

సంబంధిత పోస్ట్