కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణ కమిషన్ గడువును మరో 2 నెలలు పొడిగించాలనే ప్రతిపాదనలకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రేపటితో విచారణ గడువు ముగియనుండగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కీలక అధికారుల్ని విచారించిన కమిషన్, దీపావళి తర్వాత ఐఏఎస్ లు, మాజీ IASలు, నిర్మాణ సంస్థలను విచారించనుంది. కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.