ఆర్మూరు పట్టణంలో జిల్లా పరిషత్ రాంమందిర్ ఉన్నత పాఠశాల 2006 2007 బ్యాచ్ విద్యార్థులు, ఇటీవల మరణించిన తమ మిత్రుడు కొట్టాల ప్రవీణ్ కుటుంబానికి ఆదివారం లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. వారు మాట్లాడుతూ తమ మిత్రుడి కుమార్తె పేరిట కిసాన్ వికాస్ పథకం కింద తమ బ్యాచ్ విద్యార్థులు అందరూ కలిసి ఆర్థిక సాయం చేసి వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు.