కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్టీసీ డిపోలో విధులు నిర్వహిస్తున్న పన్నెల వెంకట్ రెడ్డి ఉత్తమ డ్రైవర్ గా, ఏ యాక్సిడెంట్లు లేని డ్రైవర్ గా గుర్తించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జె. శ్రీనివాస్, ఆర్టీసీ డిపో మేనేజర్ సరితా దేవి చేతుల మీదుగా అవార్డు ను తీసుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయనకు పలువురు ఆర్టీసీ అధికారులు, ఆర్టీసీ సిబ్బంది అభినందనలు తెలియజేశారు.