బాన్సువాడ పట్టణంలోని చెరువులను రాళ్లు, మట్టితో ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు అని బీజేపీ పార్టీ అధ్యక్షులు తృప్తి శివప్రసాద్ బుధవారం ఆరోపించారు. బాన్సువాడ పట్టణంలోని చెరువులన్నీ కబ్జాలకు గురవుతున్నాయి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని ఎల్లయ్ చెరువును గతంలో వారపు సంత కోసం సగం చెరువుని పూడ్చివేశారు. ఇప్పుడు బండరాళ్లు మట్టితో చెరువును పూడ్చేస్తూ క్రమంగా ఆ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారన్నారు.