భవన నిర్మాణ కార్మికులు తప్పనిసరి లేబర్ కార్డును కలిగి ఉండాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్ రాములు అన్నారు. గురువారం బాన్సువాడ పట్టణంలోని నాయి బ్రాహ్మణ సంఘంలో భవన నిర్మాణ కార్మికులతో డివిజన్ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. లేబర్ కార్డు ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని కార్మికులు లేబర్ కార్డును కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.