కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గురువారం పేరెంట్, టీచర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాల్ అసద్ ఫారూఖ్ మాట్లాడుతూ విద్యార్థినుల ప్రగతి గురించి తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.