అక్రమ మొరం తవ్వకాల నిలిపివేత: తహశీల్దార్

81చూసినవారు
అక్రమ మొరం తవ్వకాల నిలిపివేత: తహశీల్దార్
నిజాంసాగర్ మండలంలోని మల్లూరులో తహశీల్దార్ భిక్షపతి గురువారం మొరం అక్రమ తవ్వకాలను నిలిపివేశారు. మల్లూరులోని సొసైటీ వెనుక భాగంలో ఓ రైతు జేసీబీ పలు టిప్పర్ల సహాయంతో గుట్టను తవ్వుతూ మొరాన్ని అక్రమంగా రవాణా చేయిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి వెళ్లిన తహశీల్దార్ దృష్టికి మొరం తవ్వకాల విషయం వచ్చింది. దీంతో మొరం అక్రమ తవ్వకాల స్థలానికి వెళ్లి నిలిపివేయాలని ఆదేశించారు. పట్టా భూమి ఉన్నప్పటికీ మైనింగ్ అనుమతులు లేనిది తవ్వకాలు చేపడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్