జుక్కల్ సెగ్మెంట్ లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు, అధికారులు లంచం అడిగితే చర్యలు తప్పవని జుక్కల్ ఎమ్యెల్యే తోట లక్ష్మీకాంతరావు హెచ్చరించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ. జుక్కుల్ రెవెన్యూ శాఖలో కొంతమంది ఉద్యోగులు లంచాలు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఫిర్యాదు వచ్చిందన్నారు. లంచం అడిగితే ఎమ్యెల్యే క్యాంప్ ఆఫీస్ తెలియచేయలన్నారు. లాంచగొండిలపై వెంటనే చర్యలు ఉంటాయన్నారు.