ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుంటే విద్యార్థులు కష్టపడి కాదు ఇష్టపడి చదివితే మంచి భవష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటారని జుక్కల్ ఎమ్యెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. బుధవారం బిచ్కుంద మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాలను ఉపాధ్యాయులు, విద్యార్థుల ఆహ్వానం మేరకు సందర్శించారు. ఈ సంధర్బంగా ఎమ్యెల్యేను సత్కరించి పలు సమస్యలు ఎమ్యెల్యే దృష్టికి తెచ్చారు.