జుక్కల్: బడి బయట పిల్లల సర్వే నిర్వహణ

84చూసినవారు
జుక్కల్: బడి బయట పిల్లల సర్వే నిర్వహణ
జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశాలనుసారం పిట్లం మండలం బండాపల్లి, బోల్లక్ పల్లి, గౌరారం, గౌరారం తండాలో 6 నుంచి 14 సంవత్సరాల లోపు బడి బయట పిల్లల సర్వేను మంగళవారం నిర్వహించడం జరిగిందని క్లస్టర్ రిసోర్స్ పర్సన్ గోపాల్ సింగ్ ఠాకూర్ తెలిపారు. బడికి వెళ్లకుండా గ్రామాలలో బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు, పిల్లలకు కౌన్సెలింగ్ నిర్వహించి సమీప పాఠశాలలో చేర్పిస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్