కామారెడ్డి జిల్లా పిట్లం మండల బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శ్రీరామ సేవా సమితి వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం దేగుల్ వాడి నుండి భద్రాచలం వరకు పాదయాత్ర చేస్తున్నటువంటి వారికి పిట్లం మీదుగా వెళ్తున్నందున హనుమాన్ ఆలయంలో అల్పాహారం పెట్టడం జరిగింది. వారితో పాటు పిట్లం దాటే వరకు పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిట్లం బజరంగ్ దళ్ సంయోజక్ మంచి రంజిత్, నాగరాజు, వినాయక్, కిట్టు యాదవ్, ప్రణయ్ పాల్గొన్నారు.