భారీ వర్షాలతో మంజీరా నదికి పెద్ద ఎత్తున వరద వచ్చి నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో బుధవారం సాయంత్రం బాన్సువాడ ఎమ్యెల్యే, ప్రభుత్వసలహదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రాజెక్టు వద్ద గంగమ్మ కు పూజలు చేసి వరద గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఆయన వెంట రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు వున్నారు.