రైస్ మిల్ యజమానులతో అదనపు కలెక్టర్ సమీక్ష

50చూసినవారు
రైస్ మిల్ యజమానులతో అదనపు కలెక్టర్ సమీక్ష
ఖరీఫ్ 2022 -23 సీజన్ కు సంబంధించి లక్ష్యాలను పూర్తి చేయని డిఫాల్టర్ రైస్ మిల్లుల యజమానులు ఈనెల 26 లోగా పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సోమవారం లక్ష్యాలు పూర్తి చేయని 35 మంది రైస్ మిల్ యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశ నిర్దేశం చేశారు. లక్ష్యాలు పూర్తి చేయని రైస్ మిల్ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్