ఉపాధి హామీ కూలీలకు ఓటు హక్కుపై అవగాహన

60చూసినవారు
ఐఎస్ఆర్డీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు శనివారం ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి అమృత రాజేందర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం అన్నారు. ప్రతి ఒక్కరూ తమ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. గ్రామంలో 100% ఓటు హక్కు వినియోగించుకునేలా కృషి చేయాలన్నారు. అనంతరం ఓటరు ప్రతిజ్ఞ చేశారు. ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్