దోమకొండలో బీఆర్ఎస్ నాయకుల ప్రచారం

53చూసినవారు
దోమకొండలో బీఆర్ఎస్ నాయకుల ప్రచారం
పార్లమెంటు భారత రాష్ట్ర సమితి ఎన్నికల ప్రచారం దోమకొండలో శనివారం ప్రారంభించారు. మొదట నాయకులు స్థానిక చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేరువేరుగా పలు వాడల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచాల శేఖర్, ఎంపీపీ శారద నాగరాజ్, కడారి రమేష్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్