మున్సిపల్ చైర్ పర్సన్ ను కలిసిన సిఐటియు జిల్లా నాయకులు

70చూసినవారు
మున్సిపల్ చైర్ పర్సన్ ను కలిసిన సిఐటియు జిల్లా నాయకులు
రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియని మున్సిపల్ యూనియన్ జిల్లా నాయకులు ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాజనర్స్ మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26, 000 ఇవ్వాలని, రెండవ పిఆర్సి ప్రకారం వేతనాలు పెంచాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి పెంచిన వెయ్యి రూపాయలు అమలు చేయాలని, పెండింగులో ఉన్న జీతాలను ఇవ్వాలన్నారు. మహబూబ్ అలీ, ప్రభాకర్ తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్