కాంగ్రెస్ పార్లమెంటరీ అభ్యర్థి సురేష్ షెట్కార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ దోమకొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల వివరాలను వివరిస్తూ ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రచార కార్యక్రమంలో నాయకులు కిష్టారెడ్డి, పిన్నెం నాగేంద్రవర్మ, రమాకాంత్, సందీప్, నీతుల అశోక్ యాదవ్, చంద్రశేఖర్, సాయి సుధీర్ లు పాల్గొన్నారు.