సిద్దిరామేశ్వరాలయానికి వరి గడ్డి వితరణ

55చూసినవారు
సిద్దిరామేశ్వరాలయానికి వరి గడ్డి వితరణ
భిక్కనూరు మండల కేంద్రంలో గల సిద్ధిరామేశ్వరాలయంలో గల కోడెల కోసం భక్తులు వరిగడ్డి వితరణ చేశారు. బుధవారం మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారి వలపుశెట్టి కైలాసం తన వంతుగా ఒక ట్రాక్టర్ లోడ్ వరిగడ్డిని కొనుగోలు చేసి ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులకు అప్పగించారు. ఆలయంలో ఉన్నటువంటి కోడెలకు గడ్డి అందించాలన్న ఉద్దేశంతో ట్రాక్టర్ గడ్డిని అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్