ఉపాధి కూలీలందరికీ పని కల్పించాలి

72చూసినవారు
ఉపాధి కూలీలందరికీ పని కల్పించాలి
ఉపాధి హామీ కూలీలందరికీ పని కల్పించాలని డిఆర్డీఏ పిడి చందర్ నాయక్ చెప్పారు. బుధవారం భిక్కనూరు మండలంలోని లక్ష్మీదేవునిపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలకు ఓఆర్ఎస్ పాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం అదే గ్రామంలో నర్సరీని పరిశీలించారు. అక్కడ పెంచుతున్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. పనులు కల్పించడంలో సిబ్బంది నిర్లక్ష్యం చేయవద్దన్నారు.

సంబంధిత పోస్ట్