ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

80చూసినవారు
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండల కేంద్రానికి చెందిన 1991-1992 బ్యాచ్ కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు కుటుంబ సమేతంగా ఏకమయ్యారు. ఈ సందర్భంగా వారి అనుభవాలను ఒకరినొకరు పంచుకున్నారు. గతంలో వారు చేసిన చిలిపి చేష్టలను పూర్తి చేసుకున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఏకం కావడం ఎంతో ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థులు తెలిపారు.

సంబంధిత పోస్ట్