నర్సన్నపల్లిలో కొనసాగిన హోం ఓటింగ్

54చూసినవారు
నర్సన్నపల్లిలో కొనసాగిన హోం ఓటింగ్
ఆదివారం కూడా కొనసాగిన హోం ఓటింగులో వృద్ధులు, వికలాంగులు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని నర్సన్నపల్లిలో వృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసీఐ నిబంధన మేరకు ప్రిసైడింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారి, మైక్రో అబ్జర్వర్, పోలీస్ కానిస్టేబుల్ తో కలిసి వెళ్లిన హోమ్ ఓటింగ్ బృందం గోప్యతగా ఓటు వేయించారు.

సంబంధిత పోస్ట్