జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలీకి పనులు

51చూసినవారు
జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలీకి పనులు
జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలీకి ఉపాధి హామీ పనులు కల్పించడం జరుగుతుందని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ చెప్పారు. భిక్కనూరు మండలంలోని భాగిర్తిపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. కూలీ పనులకు వస్తున్న కూలీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ, ఉపాధి హామీ పనులు కల్పించడంలో సిబ్బంది నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. పనుల వద్ద నీటి వసతి, నీడ వసతి ఉంచాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్