ఉమ్మడి జిల్లాలో వరుస దొంగతనలు చేసిన దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించినట్లు ఏఎస్పి చైతన్య రెడ్డి తెలిపారు. గురువారం ఆమె కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేరం చేసిన వారి ముగ్గురి నుండి 3 గ్రాముల బంగారం, 2 పల్సర్ బైకులు, ఒక ఫ్యాషన్ ప్రో బైక్, రెండు మైక్ సెట్లు, ఒక ఆటో, ఒక మేక, వెండి కండ్లు ఏడు జతలు, ట్రాక్టర్ బ్యాటరీ స్వాధీనం చేసుకున్నామని వీటి విలువ రూ.4 లక్షలు అన్నారు.