
ఆయిల్ ట్యాంకర్లో చెలరేగిన మంటలు
AP: తిరుపతి జిల్లా తుంగపాలెం వద్ద ఓ ఆయిల్ ట్యాంకర్లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భారీగా మంటలు వ్యాపించి ట్యాంకర్ ఇంజిన్ భాగం పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న గూడురు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.