మహాత్మ జ్యోతిబాపూలేను ఆదర్శంగా తీసుకోవాలి

60చూసినవారు
మహాత్మ జ్యోతిబాపూలేను ఆదర్శంగా తీసుకోవాలి
సంఘ సేవకుడు మహాత్మా జ్యోతిబాపూలేను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పలు గ్రామాల నాయకులు అన్నారు. గురువారం ఆయన జయంతిని పురస్కరించుకొని భిక్కనూర్ మండలంలోని జంగంపల్లి, బస్వాపూర్ గ్రామాలలో వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, దేశంలో అణగారిన మహిళల కోసం ప్రత్యేక పాఠశాలలను స్థాపించారని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలకు విద్యను అందించడంలో ఎంతో కృషి చేశారన్నారు.

సంబంధిత పోస్ట్