వైకుంఠధామాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్

60చూసినవారు
వైకుంఠధామాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్
కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ లోని వైకుంఠధామాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియ చంద్రశేఖర్ రెడ్డి సోమవారం పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని అధికారులకు ఆదేశించారు. వీధి దీపాలు, నీటి సమస్య, తొందర్లోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, ఏఈ శంకర్, ఎస్సై రవీందర్, ఇన్ చార్జి ఎస్ఐ పర్వేజ్, ఎఫ్ బి ఓ శ్యామ్, తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్