కామారెడ్డి జిల్లా మైనార్టీ, సోషల్ వెల్ఫేర్, జ్యోతిబాపూలే పాఠశాలలు, వసతి గృహాలలో మైనర్, మేజర్ మరమ్మత్తులుంటే గుర్తించి ప్రతిపాదనలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం ప్రిన్సిపాల్ లతో, వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా వసతి గృహల సంక్షేమ అధికారులు క్షేత్రస్థాయిలో వసతి గృహాలను సందర్శించి కావలసిన మరమత్తులను గుర్తించాలన్నారు.