రుణాల మంజూరుకు లేని నిబంధనలు రుణమాఫీకి ఎందుకు..

78చూసినవారు
రైతులకు వ్యవసాయ రుణాలు ఇచ్చేటప్పుడు లేని నిబంధనలు రుణమాఫీకి ఎందుకని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు గురువారం వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనల కారణంగా 70 శాతం రుణమాఫీ జరగలేదని వెంటనే రుణమాఫీ చేసి తిరిగి రుణాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్