ఎల్లారెడ్డి: దళితులపై దాడులు జరిపితే సహించేది లేదు

73చూసినవారు
దళితులపై దాడులు జరిపితే సహించేది లేదని పలుదళిత సంఘాల నాయకులు స్పష్టం చేశారు. నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్ భర్త శేఖర్ పై జరిగిన దాడిని నిరసిస్తూ మంగళవారం ఎల్లారెడ్డి అంబేద్కర్ చౌరస్తా వద్ద పలు దళిత సంఘాల నాయకులు ముఖానికి నల్ల గుడ్డ కట్టుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. మాల మాదిగలను లక్ష్యం చేసుకుని దాడి చేయడం హేయమైన చర్య అని తెలంగాణ యువజన హక్కుల పోరాట సమితి అధ్యక్షులు టి ఎన్. రమేష్ అన్నారు.

సంబంధిత పోస్ట్