కామారెడ్డి జిలా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో, గురువారం ఎల్లారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో హెచ్ఐవి, ఎయిడ్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారని పాఠశాల హెచ్ ఎం వేంకటేశ్వర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలోని 10, 9 వ తరగతి విద్యార్థులకు కమ్యూనిటి హెల్త్ సెంటర్ ఐ సి టి సి కౌన్సిలర్ ఎం. గోపాల్ హెచ్ఐవి, ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు.