రోడ్డు ప్రమాదంలో డెలివరీ బాయ్ మృతి

76చూసినవారు
రోడ్డు ప్రమాదంలో డెలివరీ బాయ్ మృతి
సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ శివారులో శుక్రవారం ఉదయం 44 నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మాచారెడ్డి మండలం ఆరెపల్లికి చెందిన కె. నందు(28) మృతి చెందినట్లు సదాశివనగర్ ఎస్ఐ. రాజు తెలిపారు. రాజు డెలివరీ బాయ్ గా పనిచేస్తూ, డెలివరీ కోసం బైక్ పై వెళ్తుండగా వెనుక నుండి వచ్చిన వాహనం ఢీ కొట్టడంతో ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఢీకొన్న వాహనం పట్టుబడిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్