మోసపూరిత కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

82చూసినవారు
మోసపూరిత కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సైబర్ క్రైమ్ నేరస్తులు వారి యొక్క నేర విధానాన్ని మార్చుకొని, మేము పోలీసులము, పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ వెంటనే డబ్బులు తీసుకొని రావాలని కాల్స్ చేస్తున్నారని, ఇలాంటి కాల్స్ మాచారెడ్డి లో ఒకరిద్దరికీ వచ్చాయని మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు. శనివారం ఎస్ఐ మాట్లాడుతూ. అలాంటి మోసపూరిత కాల్స్ నీ ఎట్టి పరిస్థితిలో నమ్మకూడదన్నారు. అలాంటి కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్