బోయినపల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ నందు ఈనెల మూడవ తేదీన మోడల్ స్కూల్ విద్యార్థులు గొడవ పెట్టుకుని కొట్టుకున్నారు. ఈ సంఘటనతో ఒక వర్గం విద్యార్థుల తల్లిదండ్రులు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిట్టడంతో ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు విద్యార్థుల తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్టు శనివారం ఎస్సై పృథ్వీధర్ గౌడ్ తెలిపారు.