చాకలి ఐలమ్మ జయంతి

60చూసినవారు
చాకలి ఐలమ్మ జయంతి
చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని గ్రామంలో ఉన్న విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. బీజేవైఎం పెద్దపెల్లి జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ.. భూమికోసం, భుక్తి కోసం, వేట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి, తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన వీరవణిత ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు తీగల అశోక్ గౌడ్, రజక సంఘం అధ్యక్షులు అరకొల్లు ఓదెలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్