జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చొప్పదండి యూత్ కాంగ్రెస్ నాయకుడు ఏనుగుల ప్రశాంత్ కుమార్ విమర్శించారు. మండలంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే యోచన రాష్ట్రాల్లోని ప్రభుత్వాల హక్కులను హరించడమేనన్నారు.