మల్యాల మండల కేంద్రంలోని ప్రసిద్ధి పుణ్య క్షేత్రమైన శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం డైరెక్టర్ శ్రీకాంత్ తో భక్తులు ఫొటోలు తీసుకున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో శ్రీకాంత్ ఓ సినిమా చేయనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.