చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ను ఆదివారం ఉదయం గంగాధర మండలంలోని బూరుగుపల్లి నివాస గృహంలో పోలీసులు అడ్డుకున్నారు. రామడుగు మండలం వెదిర పర్యటనకు వెళ్తున్న ఆయనను పోలీసులు అడ్డుకోవడం పట్ల రవి శంకర్ తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హామీలపై రైతులకు ఇచ్చిన వాగ్దానాలను ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.