ఎమ్మెల్యే సత్యంను పరామర్శించిన జీవన్ రెడ్డి

67చూసినవారు
ఎమ్మెల్యే సత్యంను పరామర్శించిన జీవన్ రెడ్డి
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు. మంగళవారం హైదరాబాద్ కొంపెల్లిలోని నివాసంలో ఆయనను కలిసి సానుభూతి తెలియజేశారు. కొన్ని రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో ఎమ్మెల్యే సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్