నాలుగు ప్రభుత్వ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం వర్తించేలా చూస్తామని, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గంగాధర మండలం నారాయణపూర్లో జరిగిన గ్రామసభలో బుదవారం ఆయన మాట్లాడుతూ. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వెలుగును నింపేందుకు తమ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. 10ఏళ్లుగా రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారందరికీ కార్డు అందుతుందని తెలిపారు.