ఇల్లంతకుంట మండలం - Ellandhakunta

కరీంనగర్ జిల్లా
కొత్త ప్రాజెక్టులను నిర్మిస్తా : ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్
May 10, 2024, 11:05 IST/మానకొండూర్
మానకొండూర్

కొత్త ప్రాజెక్టులను నిర్మిస్తా : ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్

May 10, 2024, 11:05 IST
2014లో ఒక్కసారి గెలిపిస్తేనే కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ స్థాయిలో ఎవరూ ఊహించని అభివృద్ధి ఫలాలను అందించానని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.. 10 లక్షల జనాభా లేని కరీంనగర్ కు స్మార్ట్ సిటీ హోదాను కల్పించడానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖను పట్టుబట్టి ఒప్పించినట్లు తెలిపారు.. తన కృషి వల్లనే ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ సుందరంగా తయారైందన్నారు. రూ.1000 కోట్లకు పైగా నిధులు రావడంతో నగరంలో కూడళ్లు, రహదారులు, క్రీడా కాంప్లెక్స్, వాటర్ డ్రైయిన్స్, ఈ-లైబ్రరీ, సిగ్నలింగ్ వ్యవస్థ, పార్కుల అభివృద్ధి ఇలా ప్రజలు మెచ్చే ప్రగతి కళ్లకు కనిపిస్తోందన్నారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో సైన్స్ సెంటర్ నిర్మా ణానికి కృషి చేశానన్నారు.. అంబేడ్కర్ స్టడీ సర్కిల్, సిరిసిల్ల, కరీంనగర్ వైద్య కళాశాలల సాధనకు చొరవ చూపించామని స్పష్టం చేశారు.. మళ్లీ ఈ సారి గెలిస్తే ఎవరూ ఊహించని విధంగా ఏడు అసెంబ్లీ స్థానాల పరిధిలో కొన్ని కొత్త ప్రాజెక్టులను తీసుకొస్తానన్నారు. మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే మార్గం ఏర్పాటులో ఇప్పుడు కనిపిస్తున్న అభివృద్ధి అంతా తను ఎంపీగా ఉన్న సమయంలో పోరాడిన ఫలితమేనని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భూసేకరణ సహా ఇతర నిర్మాణ ఒప్పందాలను చేపట్టి కీలకమైన ప్రాజెక్టును తీసు కొచ్చానన్నారు. ఈసారి గెలిచిన రెండేళ్లలో తప్పకుండా కొత్తపల్లి వరకు రైలు కూత పెట్టే విధంగా నిధులు సాధిస్తానన్నారు..