కరీంనగర్ లోని స్థానిక విద్యానగర్ లో గల సువిద్య పాఠశాలలో 78వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ప్రదర్శించిన మార్చ్ పాస్ట్ , ఫ్రీడం ర్యాలీ, పిరమిడ్స్ మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. విద్యార్థులందరూ భవిష్యత్తులో దేశం కోసం సేవ చేస్తూ మంచి పౌరులుగా ఎదగాలని కరస్పాండెంట్ మట్టతిల్ బాబు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మధు కుమార్ , అకాడమిక్ ఇంచార్జ్ శేషు మణి , ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.