అంబేద్కర్ 133 వ జయంతోత్సవ కరపత్రాల ఆవిష్కరణ

61చూసినవారు
అంబేద్కర్ 133 వ జయంతోత్సవ కరపత్రాల ఆవిష్కరణ
బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతోత్సవ కరపత్రాలను మంగళవారం హుజురాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను దళిత బహుజనులందరు హాజరై ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జయంతోత్సవ కమిటీ చైర్మన్ కాళీద్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి ఇల్లందుల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్