హుజురాబాద్ లో చల్లబడిన వాతావరణం
హుజురాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కొద్దిసేపటి క్రితం ఈదురు గాలులు వీచాయి. అనంతరం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఇటీవల కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతల పెరిగి ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. గత పది రోజులుగా ఎండ తీవ్రత బాగా పెరిగింది. ఈ సమయంలో భారీ వర్షం కురవడంతో హుజురాబాద్ నియోజకవర్గం అంతా ఆహ్లాద భరితంగా మారింది. హుజురాబాద్ వాసులకు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగింది.