సామాజిక అంశాలపై పోలీస్ కళ బృందాల అవగాహన

51చూసినవారు
సామాజిక అంశాలపై పోలీస్ కళ బృందాల అవగాహన
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపుర్ లో పోలీస్ కళాబృందం వారు బుధవారం సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. మూఢ నమ్మకాలు, ఆత్మహత్యల నివారణ, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియమాలు, గల్ఫ్ ఏజెంట్ల మోసాలు, సైబర్ మోసాలు, నివారణ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీధర్, ఎంపీటీసీ, మాజీ సర్పంచ్, పోలీసు సిబ్బంది, పోలీస్ కళా బృందం సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్