భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ నుండి విముక్తి కోసం సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలు సాగించాలని, మతోన్మాదం, కార్పొరేట్ సంస్థల కలిసి ప్రజలపై చేసిస్తున్న దాడులను ఎదుర్కోవాలని సిపిఎం రాష్ట్ర నాయకులు పుప్పాల శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ఆదివారం జగిత్యాల పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పక్షోత్సవాల సభ సిపిఎం జిల్లా కన్వీనర్ జి. తిరపతినాయక్ అధ్యక్షతన జరిగింది.